news

సామాన్యులపై బరితెగించిన SBI బ్యాంకు …

SBI మరో భాగోతం

sbiఅన్నీ సేవింగ్స్ అకౌంట్స్ లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలని జాతీయ బ్యాంకులు 2017 ఏప్రిల్ నుంచి కచ్చితం చేశాయి. ఈ క్రమంలోనే 2017 సంవత్సరంలో ఇప్పటి వరకు స్టేట్ బ్యాంక్ ఇండియా కస్టమర్ల నుంచి రూ1,771 కోట్ల ఫైన్.. మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయనందుకు విధించింది. కేరళలోని అలప్పుజాకి చెందిన వృధ్ధురాలు “హమీదా బీవి” కోయిర్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి వచ్చే పెన్షన్ తో జీవిస్తుంది. ఈమెకు లోకల్ SBI బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఈ ఎకౌంట్ ద్వారా ఆమెకు రూ.3,300 వేలు పెన్షన్ వస్తుంది.

అయితే కొంతకాలంగా ఆమె మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయటం లేదు. దీంతో జనవరి నెలలో ఆమె ఖాతాలో రూ.3వేల 300 పెన్షన్ డబ్బు పడింది. కనీస నిల్వ లేనందున విధించే జరిమానా కింద రూ.3వేల 050 కట్ చేశారు. మిగిలిన రూ.250 చేతిలో పెట్టారు. దీంతో ఆమె వేదన అంతా ఇంతా కాదు. రూ.3300 వస్తేనే జీవితం సాఫీగా సాగటం లేదు.. అలాంటిది కనీస నిల్వ వెయ్యి రూపాయలు ఎలా ఉంచుతామని హమీదా బీవి కన్నీళ్లపర్యంతం అయ్యింది.

ఈ విషయాన్ని కేరళ ఆర్ధిక శాఖ మంత్రి TN ధామస్ ఇసాక్.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కేవలం పెన్షన్ పై మాత్రమే ఆధారపడే హమీదా బీవి.. పెన్షన్ కోసమే బ్యాంక్ ఖాతా తెరిచింది. అందువల్ల మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేసే అవకాశం లేదని మంత్రి కామెంట్ చేశారు. హమీదా మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయని అన్నీ నెలలకు కలిపి 17.7 శాతం ఫైన్ విధించింది బ్యాంక్. మిగిలిన 250 రూపాయలు తీసుకున్నా.. తీసుకోకున్నా వచ్చే నెల మళ్లీ ఫైన్ వేస్తారని.. ఇదేమి విడ్డూరం అని మంత్రి ప్రశ్నించాడు.

Comments

comments