news

గజల్ శ్రీనివాస్ కూతురు గురించి నివ్వెరపోయే నిజాలు తెలుసా?!!

యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పక్కా ఆధారాలతో గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు ఈ నెల 2న అరెస్టుచేసి చంచల్‌గూడ న్యాయస్థానానికి తరలించిన విషయం తెలిసిందే. తెలుగువాడై ఉండి గజల్ కు అంతర్జాతీయ స్థాయిలో ఫేమ్ తీసుకొచ్చిన ఈ ఘటికుడు…. గజీతగాడు పిల్లకాలువలో పడి ఏదో అయిపోయాడన్న సామెతలా… లైంగిక వాంఛలను నెరవేర్చుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయాడు. ఎంత గొప్ప వ్యక్తికి అయినా ఏదో ఒక వీక్ నెస్ ఉంటే సాధించిన ఘనకార్యం మొత్తం దానిముందు తేలిపోతుందన్నట్లుగా తయారైంది ఇప్పుడు గజల్ శ్రీనివాస్ పరిస్థితి. మసాజ్ ల పేరిట కార్యాలయ ఉద్యోగినులనే వేధించారనే కేసులో శ్రీనివాస్‌ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

అయితే శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది నాంపల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌శారు. ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సమాజంలో పేరున్న వ్యక్తి గనక బెయిల్‌ మంజూరుచేస్తే సాక్ష్యాలను తారుమారుచేసే అవకాశం ఉన్నందున శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయవద్దని పోలీసుల తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని అభ్యర్థించడంతో కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది.

గజల్ శ్రీనివాస్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 354 సెక్షన్ వర్తించదని, కాబట్టి తమ క్లైయింట్‌కు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అసలు సెక్షనే వర్తించనప్పుడు ఆయనను జైల్లో ఎలా పెడతారని కోర్టును ప్రశ్నించారు. ఆయన రేపు నిర్దోషిగా బయటపడిన తర్వాత శ్రీనివాస్ జైల్లో గడిపిన నష్టాన్ని ఎలా పూడుస్తారని కోర్టును అడిగారు. దీంతో ఈ కేసుకు సంబంధించి కౌంటర్ ఫైల్ చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.

ఇదిలా ఉండ‌గా గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కడంతో ఆయన కుమార్తె గురించి కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌జ‌ల్ శ్రీ‌నివాస్‌కు కూతురు పేరు సంస్కృతి. గ‌జ‌ల్ శ్రీ‌నివాస్‌లానే.. ఆయ‌న కూతురు సంస్కృతి కూడా గ‌జ‌ల్స్ పాడుతూ అంద‌ర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. తెలుగువాళ్లలో అతికొద్దిమందికే పరిమితమైన ఈ కళలో ఆరితేరిన సంస్కృతి తన కళా ప్రజ్ఞతో నివ్వెరపోయేలా చేస్తోంది. అంతేగాక‌, దేశ విదేశాల్లో ఆమె విడుద‌ల చేసిన ఆల్బ‌మ్స్ చాలా ప్రాచూర్యం పొందాయి. సంస్కృతి 2005 నుంచి గ‌జ‌ల్స్ పాడుతోంది. ఇప్ప‌టికే ఆమె అనేక అవార్డులు,  కూడా అందుకుంది.

అంతేగాక‌, ఇటీవ‌ల జ‌రిగిన అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో ఆమె ఉత్త‌మ అవార్డును అందుకుని శభాష్ అనిపించుకుంది. అలాగే వైశ్విక ఫౌండేష‌న్ ఇటీవ‌ల ఆమెకు ముంబైలో యువ ప్ర‌తిభా పుర‌స్కారాన్ని కూడా అంద‌జేసింది. గ‌జ‌ల్ శ్రీనివాస్ కు వ్యక్తిగతమైన బలహీనతలు ఉంటే ఉండొచ్చుగాక.. కాని తన కూతుర్ని తాను నమ్ముకున్న కళలోనే తీర్చిదిద్ది తనంతటి స్థాయికి తీసుకురావాలని ఆయన పడిన తపన, ఇచ్చిన ప్రోత్సాహం గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఆయన కళాభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు శ్రీనివాస్ సచ్ఛీలుడిగా బయటికి వస్తారని ఆశాభావంతో ఉన్నారు.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment