Sports

టెస్ట్ ఛాంపియన్ షిప్ లీగ్ కు ఆమోదం తెలిపింది ఐసీసీ.

ఎన్నో ఏళ్లుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న టెస్ట్ లీగ్ కు ఐసీసీ ఆమోదముద్రం వేసింది. తొమ్మిది దేశాలతో టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు కొత్తగా అంతర్జాతీయ వన్డే లీగ్ ను కూడా జరుపుతామని ఐసీసీ ప్రకటించింది.

రెండేళ్ల టెస్ట్ ఛాంపియన్ షిప్ 2019 వరల్డ్ కప్ ముగిసిన తరువాత ఆరంభం అవుతుంది. ఈ టెస్ట్ లీగ్ లో మొత్తం 9 జట్లు పాల్గొంటాయి. 2019 నుంచి రెండేళ్ల పాటు ఒకో జట్టు ఆరు సిరీస్ లు ఆడతాయి. ఇందులో మూడు సిరీస్లు స్వదేశంలో ఇంకో మూడింటిని విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది. ప్రతి జట్టు కనీసం రెండు టెస్టులు గరిష్టంగా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. చివరగా టాప్ లో నిలిచిన రెండు జట్లు 2021లో ఇంగ్లాండ్ లో జరిగే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తలపడతాయి.

టెస్టులలో డే/నైట్ తర్వాత నాలుగు రోజుల టెస్టుకు ఐసీసీ ఆమోదం తేలిపిండి. దక్షిణాఫ్రికా , జింబాబ్వే మధ్య డిసెంబర్ 26 నుంచి 29 వరకు జరిగే బాక్సింగ్ డే టేస్ట్ మ్యాచ్ తో ఈ నాలుగు రోజుల టెస్టు ప్రారంభం కానుంది.

Comments

comments