movies

టాప్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్ అయింది

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుటుంబంలో పెళ్లి భాజా మ్రోగ బోతోందా? ఆయన కూతురు, హీరోయిన్ శృతి హాసన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి చెన్నై సినీ వర్గాల నుండి.శృతి హాసన్ ఓ విదేశీయుడితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటాలియన్ సంతతికి చెందిన మైఖేల్ కోర్సేల్‌తో శృతి హాసన్ కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. లండన్లో స్టేజ్ యాక్టర్‌గా రాణిస్తున్న మైఖేల్‌ తన ప్రియురాలు శృతి హాసన్ కోసం చాలా సార్లు ఇండియా వచ్చారు.

గత కొద్ది రోజులుగా శృతి హాసన్ లవ్ ఎఫైర్ పై రకరకాల వార్తలు మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే తాజాగా మరో షాకింగ్ న్యూస్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే…కొన్ని రోజుల క్రితం ఆమె తన విదేశీ ప్రియుడిని సీక్రెట్ గా వివాహం చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

శృతి హాసన్ కొన్ని రోజులుగా లండన్ బేస్డ్ థియేటర్ ఆర్టిస్ట్ మిచేల్ కోర్సల్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.అతడు ఇటీవల వచ్చి కొన్ని రోజులు శృతి హాసన్ తో గడిపి వెళ్లాడు. ఇద్దరూ ప్రస్తుతం డేటింగులో కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని రోజుల క్రితమే ఇద్దరూ ఇటలీలో రహస్య వివాహం చేసుకుందని… అందుకే శృతి హాసన్ తరచూ ఇటలీకి, ఇండియాకి ప్రయాణాలు చేస్తోందనే రూమర్స్ వినిపిస్తున్నాయిపెళ్లయితే ఆఫర్స్ దెబ్బతింటాయనే ఉద్దేశ్యంతో తన మ్యారేజ్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినట్లు టాక్.

అయితే శృతి హాసన్ సన్నిహితులు మాత్రం ఈ విషయాలను కొట్టిపారేస్తున్నారు. శృతిహాసన్ … ఏం చేసినా…. ధైర్యంగా చేస్తుందని చెప్తున్నారు. అయితే శృతి మాత్రం ప్రస్తుతానికి అలాంటిది ఏమి లేదు .సమయం వస్తే మా అమ్మ నాన్నతో నేనే చెప్పెస్తాన్నని అంటుంది .అయితే త్వరలో శృతి హాసన్, మైఖేల్ వివాహం చేసుకోబోతున్నరు .

ఈ విషయాన్ని ఇద్దరూ కమల్ హాసన్ తో చర్చించినట్లు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే త్వరలో కమల్ హాసన్ ఇంట్లో శుభకార్యం చూడబోతున్నాం. దాపరికాల్లేకుండా తిరిగిన జంట శృతి హాసన్ ఏ విషయంలో అయినా ఓపెన్ మైండెడ్. ఎలాంటి దాపరికాల్లేకుండా శృతి హాసన్, మైఖేల్ ఇండియాలో చెట్టా పట్టాలేసుకుని తిరిగారు.ఈ క్రమంలోనే ఇద్దరూ వివాహానికి సిద్ధమైనట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తన ప్రియుడిని ఇటీవలే తన తల్లి సారికకు పరిచయం చేసిందట.

దీంతో వీరు వివాహం చేసుకోబోతున్నారని, అందుకే సారికను కలిశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే శృతి హాసన్, మైఖేల్ వివాహంపై అధికారిక సమాచారం అయితే ఏమీ లేదు. కేవలం మీడియాలో వివాహం అంటూ పుకార్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అయితే ఈవార్త నిజం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment