news

త్రిషపై క్రిమినల్ కేసు.. ఎందుకో తెలుసా?!!

హీరోయిన్ త్రిషపై కంప్లైంట్ చేశారు ఓ నిర్మాత. తమిళంలో మాత్రం పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడిపై సామి2 చిత్ర నిర్మాత శిబు థమీన్స్ నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివరాలలోకి వెళితే వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. 2003లో సామి అనే సినిమాను చేసిన విక్రమ్ ఇప్పుడు సీక్వెల్ గా సామి2 చేస్తున్నాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిషని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.

కొద్ది రోజులు షూటింగ్ లో పాల్గొన్న త్రిష, ఇతర కారణాల వలన సినిమా నుండి తప్పుకుంది. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ కీర్తి సురేష్ ని సెలక్ట్ చేశారు. అయితే సినిమా నుండి అర్ధాంతరంగా తప్పుకొని తమకు చాలా నష్టపరచిన త్రిషపై కఠిన చర్యలు తీసుకోవాలని శిబు నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేశాడట. మరి దీనిపై నడిఘర్ సంఘం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఈ విషయపం త్రిష కూడా ఇంతవరకు రియాక్టు కాలేదు. ఈ నేపథ్యంలో కథానాయికగా కీర్తి సురేష్ ని సెలక్ట్ చేశారు. అయితే సినిమా నుండి అర్ధంతరంగా తప్పుకొని తమని చాలా నష్టపరచిన త్రిషపై కఠిన చర్యలు తీసుకోవాలని శిబు నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేశాడట. మరి దీనిపై నడిఘర్ సంఘం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.

 

నడిఘర్ లోనే కాకుండా పోలీసు స్టేషన్ లోనూ నిర్మాత కంప్లయింట్ చేశారని సమాచారం. నిర్మాత శిబు, త్రిష ల వ్యవహారం చెన్నైలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయపం త్రిష కూడా ఇంతవరకు రియాక్టు కాలేదు. గతంలో త్రిష పై ఈ తరహా వివాదాలు అనేకం వచ్చాయి. ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించి రోడ్డుపై గొడవకు దిగడం వంటి ఆరోపణలనూ ఈ అమ్మడు ఎదుర్కొంది.

 

Comments

comments