politics

‘జనసేన’నుంచి త్రివిక్రమ్ పోటీ.. ఇదిగో చెప్పేశాడుగా

పొలిటికల్ గా పవన్ వెనుక ఉన్న ‘అజ్ఞాతవాసి’ ఎవరో తేలిపోయింది. చల్ చలోరే చలోరే చల్ ప్రోగ్రాం ప్లానింగ్, టైటిల్, కథ, స్క్రీన్ ప్లే ఆయనే అని ఇప్పటికే చాలా మందికి సందేహం. ఆ సందేహానికి సమాధానం ఇచ్చేశారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఓ రాజకీయ సభను తలపించేలా జరిగిన ఆడియో లాంఛ్ లో టెమ్ట్ అయిపోయారు ఈ దిగ్దర్శకుడు… ‘జనసేన’లో పవన్ కీరోల్ పోషించబోతున్నారని ఒకే ఒక్క పవర్ ఫుల్ డైలాగ్ తో చెప్పాశారు.

జనసేనలో నాయకులెవరూ లేరు. సర్వం ఆయనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్.. పొలిటికల్ డయాస్ లు, యాత్రలు వరకు ఓకే కాని ఎన్నికల్లో మాత్రం ఒక్కరితో అయ్యే పనికాదు కదా.. వ్యూహాల దగ్గర నుంచి అమలు వరకు నమ్మకమైన మిత్రులుండాలి. తనకంటూ ప్రత్యేకమైన కొందరినైనా పోటీలో లేకపోతే ఎలా? అసలే 2019 ఎన్నికల్లో జనసేనను ఆంధ్రా రాజకీయాల్లో ఓ ప్రధాన రాజకీయ పార్టీగా నిలబెట్టాలనే తాపత్రయంలో జనసేనాని ఉన్నారు. అందుకే ఇటీవల ‘చల్ చలోరే చలోరే చల్’అంటూ ఓ పొలిటికల్ టూర్ కూడా వేశాడు. అయితే ఈ టూర్ కి టైటిల్ నుంచి సాంగ్స్ వరకు, కొన్ని పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్.. అసలు కథ, స్ర్కీన్ ప్లేలోనే త్రివిక్రమ్ పాత్ర ఉందని చాలా మందే అనుకుంటున్నారు. అయితే..

‘అజ్ఞాతవాసి’ ఆడియో లాంఛ్ సందర్భంగా అన్యాపదేశంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మాట అనేశారు… పవన్ తో లాంగ్ జర్నీ చేయాలని ఉందని… మళ్లీ వెంటనే సినిమాల పరంగా అంటూ తన డైలాగ్ సరిచేశారు. అవును.. తన మనసులోంచి వచ్చిన మాటయినా సరే.. ఆ మాత్రం కరెక్షన్ చేయకుండా భారీ నష్టమే జరుగుంది. అది ఎలా అంటారా? ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉంది. మరోవైపు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాను ఓ సెక్షన్ పీపుల్ కు పరిమితం చేసినట్టవుతుంది ‘త్రివిక్రమ్’ చేజేతులారా… అందుకే ఇప్పటికయితే క్లారిటీలా చెప్పేశారు. అసలే చరణ్, ఎన్టీఆర్ లతో ఓ మల్టీస్టారర్ ప్లానింగ్ లో కూడా ఈ మాటల మాంత్రికుడు ఉన్నాడు. ఈ సమయంలో జనసేనానిగా ముద్రపడితే కొందరివాడిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఏది ఏమయినా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టే ఈ ఉద్దండ దర్శకుడు 2019 సాధారణ ఎన్నికల్లో జనసేన తరపున ఎంపీ లేదా ఎంఎల్ఏ గా పోటీ చేయడం ఖాయంగా పవన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయినా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదుకదా? కాకపోతే అప్పటి రాజకీయ సమీకరణలకు అనుగుణంగా గెలుపు ఓటములెలా ఉన్నా తన ఛరిష్మా, సినిమా మార్కెట్ కు ఏమాత్రం భంగం కలగకుండా డెసిషన్స్ తీసుకుంటారు సినీ ప్రముఖులు.

Comments

comments