news

తులసి చెట్టు బట్టి మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు …

తులసి చెట్టు చెప్పేస్తుంది

తులసి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కనీస ఆరోగ్య అవగాహన కలిగిన వారెవరికయినా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని వల్ల మనం పలు అనారోగ్యాలను నయం చేసుకోవొచ్చు. ఆద్యాత్మికంగా తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, దాని వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతారు. అయితే అప్పుడప్పుడు తులసి చెట్టు కొన్ని కారణాల వల్ల ఎండిపోవడం జరుగుతుంది. దీంతో ఇంట్లో భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకోవొచ్చునట. ఈ క్రమంలో తులసి చెట్టు ఎలా మారితే ఏమి జరుగుతుందో చూడండి.తులసి చెట్టు ఆకులు అకస్మాతుగా రంగు మారితే దాని అర్ధం ఏమిటంటే వాళ్ళ ఇంట్లో వారిపై ఎవరో తాంత్రిక క్షుద్ర శక్తులు ప్రయోగిస్తున్నారని అర్ధమని భూత వైద్యులు, నాటు వైద్యులు చెబుతున్నారు.

ఎవరో అలా ప్రయోగించి వారిని నాశనం చేయాలని చూస్తేనే అలా రంగు మారుతాయట.మంచిగా నీళ్ళు పోసి పెంచుతున్న చెట్టు అకస్మాతుగా ఎండిపోతే ఆ ఇంట్లో యజమానికి అనారోగ్యంగా ఏదో కీడు జరగబోతుందని అని అర్ధం చేసుకోవాలట. తులసి చెట్టుకు నీళ్ళు పోయకున్నా అది పచ్చగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి అదృష్టం కలవబోతుందని అర్ధమట. శాస్త్రీయంగా ఈ ఎత్తున అభివృద్ధి అయిన క్రమంలో ఇవన్నీ వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తాయి కాని.. మన దేశంలో చాలా మంది తమకు ఆపద, అనారోగ్యం వస్తే వైద్యుడినో, సంబంధిత నిపుణుడినో సంప్రదించడానికంటే ముందుగానే పైన చెప్పిన నమ్మకాలు, విశ్వాసాలవైపే తమ మొదటి అడుగులు వేస్తారు. అందుకే ఇటువంటివి ఇప్పటికీ దేశంలో ప్రాచుర్యంలో ఉన్నాయి.

Comments

comments