news

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే.. ఇలా తెలుసుకోవచ్చు..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో యూజర్లకు బ్లాకింగ్ ఫీచర్ లభిస్తున్న విషయం తెలిసిందే. దీని సహాయంతో అపరిచితులను మనం బ్లాక్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల వారి నుంచి మనకు అవాంఛిత కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఉంటాయి. అయితే ఒక్కోసారి మనకు అవసరం ఉన్నవారు, తెలిసిన వారు కూడా పొరపాటున మన ఫోన్ నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేస్తుంటారు. దీంతో మనకు, వారికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఇది ఒక్కోసారి మనకు తెలియదు కూడా. దీంతో ఇబ్బందులు వస్తాయి. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే వాట్సాప్‌లో మిమ్మల్ని ఎదుటి యూజర్ బ్లాక్ చేశారా లేదా అన్నది తెలుసుకోవాలి.

దీంతో సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. అయితే వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా అనేది కింద స్టెప్స్ పాటిస్తే ఈజీగా తెలుసుకోవచ్చు..

  • వాట్సాప్‌లో ఎవరైనా యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే వారి స్టేటస్ మీకు కనిపిందు. అంటే వారు ఆన్‌లైన్‌లో ఉన్నారా, ఆఫ్‌లైన్‌లో ఉన్నారా అనే విషయం మీకు తెలియదు. అయితే ఈ సెట్టింగ్ బ్లాక్ చేయకపోయినా అందరికీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే బ్లాక్ చేస్తే మాత్రం సదరు యూజర్ స్టేటస్ మీకు కనిపించదు. దీంతో మిమ్మల్ని ఆ యూజర్ బ్లాక్ చేశారని తెలుసుకోవాలి.
  • ఎవరైనా యూజర్ వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేస్తే మీరు ఆ యూజర్‌కు చెందిన ప్రొఫైల్‌ను చూడలేరు. ప్రొఫైల్ బొమ్మపై క్లిక్ చేసినా బ్లాంక్ సర్కిల్ వస్తుంది. ఎలాంటి ఫొటో కనిపించదు. ఇలా ఉన్నా మిమ్మల్ని అవతలి వ్యక్తి బ్లాక్ చేశాడని గుర్తించాలి.

  •  ఎవరైనా ఒక యూజర్‌కు మీరు ఏదైనా మెసేజ్ పంపితే దానికి కేవలం సింగిల్ టిక్ మాత్రమే చూపిస్తుంటే అప్పుడు మిమ్మల్ని ఆ యూజర్ బ్లాక్ చేసినట్టు తెలుసుకోవాలి. బ్లాక్ చేయకపోతే మెసేజ్ డెలివరీ అయినట్టు డబుల్ టిక్ వస్తుంది. యూజర్ ఆ మెసేజ్‌ను చూశాక బ్లూ టిక్కనిపిస్తుంది.

 

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ డేటా లేదా వైఫై సిగ్నల్ బాగానే ఉన్నప్పటికీ మీరు వాట్సాప్‌లో ఎవరికైనా వాయిస్ లేదా వీడియో కాల్ చేస్తే అది కలవకపోతే అప్పుడు ఆ యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు గుర్తించాలి.

Comments

comments