news

వాట్సాప్‌ యూజర్లూ.. నిజం తెలుసుకోండి!

ఒకప్పుడు సమాచారాన్ని పంచుకోవడానికి ఎస్‌ఎంస్‌లను విరివిగా వాడేవాళ్లు. వాట్సాప్‌ రాకతో వాటికి కాలం చెల్లిందనే చెప్పాలి. ముఖ్యంగా డేటా వినియోగం పెరగడంతో వాట్సాప్‌ను వినియోగించే వారి సంఖ్యా పెరిగింది.

‘ప్రస్తుతం పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా కేవలం పంపే వ్యక్తి, ఆ సమాచారాన్ని అందుకునే వ్యక్తి మాత్రమే దానిని చదవగలరు. అదే సమయంలో మా ఫ్లాట్‌ఫాం వేదికగా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చెందకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదో జటిల సమస్య.

ఒకరకంగా చెప్పాలంటే వాట్సాప్‌ లేకుండా రోజు గడవని పరిస్థితి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ వేదికగా చక్కర్లు కొట్టే అబద్ధపు, అసత్య, అవాస్తవ సమాచారానికి కొదవలేదు.

ఇలాంటి సమాచారం తమ ఫ్లాట్‌ఫాం వేదికగా వ్యాప్తిచెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని వాట్సాప్‌ వెల్లడించింది.

ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కారణంగా వేరొకరి సమాచారాన్ని మేము చదివే వీలు లేదు. దీంతో వాట్సాప్‌ వేదికగా పంచుకునే సమాచారం నిజమైనదా? అసత్యమైనదా? అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాం’ అని వాట్సాప్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అలన్‌ కాయ్‌ తెలిపారు.

వాట్సాప్‌లో ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి తగ్గించేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అసత్య సమాచారం వ్యాప్తి చెందుతోందని అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని, వాటిలో రూమర్స్‌, కొత్త కరెన్సీ నోట్లలో జీపీఎస్‌ చిప్‌, ముజఫర్‌నగర్‌ ఆందోళనల వీడియోలు..

ఇలా అనేకం వాట్సాప్‌ ద్వారా వైరల్‌గా మారాయని అన్నారు. వీటిని కొందరు నిజమని భావిస్తున్నారని, ఇలాంటి సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఒక సమాచారాన్ని ఇతరులతో పంచుకునే సమయంలో ప్రతి వాట్సాప్‌ వినియోదారుడు అందులో నిజమెంతో గ్రహించాలని, అప్పుడు మాత్రమే దానిని ఇతరులతో పంచుకోవాలని సూచించారు.

ఫేస్‌బుక్‌కు చెందిన మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌నకు ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్‌ యూజర్లు ఉండగా, ఒక్క భారతదేశంలోనే 200 మిలియన్ల మందికి పైగా వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు.

Comments

comments