news

రైలు వెనుక ‘x’గుర్తు ఎందుకు ?

మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్ర‌శ్న‌, రైలు ఎక్క‌ని వారు ఎవ‌రైనా ఉంటారా? అని అడ‌గ‌బోతున్నారా? అయితే అస‌లు మ్యాట‌ర్ మాత్రం అది కాదు లెండి. ఎందుకంటే ఆ ప్ర‌శ్న‌కు ఇంకా కొన‌సాగింపు ఉంది. అదేమిటంటే… రైలు ఎక్క‌డానికి స్టేష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు రైలు బోగీల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా. ప్ర‌ధానంగా రైలు చివ‌రి పెట్టె వెనుక భాగాన్ని ప‌రిశీలించారా? ప‌రిశీలించాం, చూశాం, అయితే ఏమిటి అంటారా? ఆ, అయితే అక్క‌డే ఆగండి.

రైలు చివ‌రి పెట్టె వెనుక భాగంలో ఆంగ్ల అక్ష‌రం X అని పెద్ద‌గా రాసి ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా చూశారా? చూశాం, అయితే ఏంటి అంటారా? ఆ, అదే… దాని గురించే మేం చెప్ప‌బోయేది. అస‌లు అలా X అని ఎందుకు రాసి ఉంటుందో మీకు తెలుసా? తెలీదా? అయితే ఎందుకో తెలుసుకోండి!ఒకరు వాటి గొప్పతనం చెబితే కాని అర్థం కాదు.

అలానే కొన్ని వస్తువులు రోజూ చూస్తున్నా..అలా ఎందుకు చేశారో, వాటి అర్థం ఏంటో పట్టించుకోం.. మీరెప్పుడైనా ట్రైన్ ఎక్కారా..? లేదా మీ ముందు నుంచి ట్రైన్ వెళిపోతుంటే..పెద్ద గుర్తుతో..ఇంటూ సింబల్ ఉండటం గమనించారా..అది ఎందుకు పెట్టారో..?అంత పెద్దగా రైలు చివర మాత్రమే ఎందుకు పెట్టారో ఆలోచించారా..? లేదా..ఎందుకో తెలుసుకోండి మరి!

 ప్రతి రైలు ఆఖరి బోగీపై పెద్ద ఇంటూ గుర్తు లేదా ఎక్స్‌ గుర్తు ఉండడం చాలా సార్లు గమనించి ఉంటారు. అది ఒక గుర్తు మాత్రమే కాదు ఒక సంకేతం కూడా. అదేమంటే…ఈ రైలు బోగీల్లో ఇదే చివరిది అని దాని అర్థం. ఇంకాస్త పరీక్షగా చూస్తే… ‘ఎల్‌వి’ అని ఆ బోగీ ఎడమ వైపు కింది భాగంలో ఒక చిన్న పాటి బోర్డు కూడా కనిపిస్తుంది.
అంటే లాస్ట్‌ వెహికల్‌ అని అర్థం. వీటితో పాటు ఉండే మరో అతి ముఖ్యమైన సంకేతం ఆ బోగీ కింది మధ్యభాగంలో ఉండే ఎర్ర లైటు. ఇవన్నీ రైలు ఆఖరి బోగీని సూచించే సంకేతాలు.
రాత్రి వేళల్లో లైటు, పగటి వేళల్లో ఇంటూ మార్క్‌ తేలికగా గమనించగల సంకేతాలు కాబట్టే వాటికి అంత ప్రాముఖ్యం. ఈ సంకేతాలలో ఏదో ఒకటి లేకపోతే మాత్రం ఆ రైలు ప్రమాదవశాత్తూ పూర్తి బోగీలు లేకుండా నడుస్తోందని అర్థం… దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై సంబంధిత అధికారుల‌కు తెలియ‌జేస్తారు. సో, రైలు చివ‌రి పెట్టె వెనుక ఉన్న అక్ష‌రాల మ‌త‌ల‌బు అద‌న్న‌మాట‌. ఇక ముందు మీరెప్పుడైనా వాటిని చూస్తే ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించండేం. పైన చెప్పిన అక్ష‌రాలు అన్నీ క‌నిపిస్తాయి. ఒక వేళ క‌నిపించ‌కుంటే మాత్రం ఎవ‌రికైనా రైల్వే అధికారుల‌కు తెలియ‌జేయ‌డం మాత్రం మ‌రిచిపోకండి.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment