news politics

జగన్ తన దగ్గరకి వచ్చిన అభిమానులకి ముద్దులేందుకు పెడతారో తెలుసా ..!

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (లేదా జగన్) – పులివెందుల నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమెల్యేగా ఎన్నుకోబడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఏకైక పుత్రుడు.జగన్ కనిపించిన వారందరినీ ముద్దు పెట్టుకోవడం ఆయన ప్రజల్లోకి వచ్చిన ప్రతీసారి చూస్తూనే ఉన్నాం. జగన్ కు యాంటీఫ్యాన్స్ అయితే, చూసే వాళ్లకు చాలా అసహ్యంగా, ఎలర్జీ గా అనిపిస్తుంది.

జగన్ కు ఇదేం అలవాటు అంటే వైసీపీ వాళ్లను ఎద్దేవా చేస్తుండటం కూడా చాలా సార్లు కనిపించేదే. ఇలా ప్రతీవాళ్లను ఆప్యాయంగా నెత్తి మీద నిమురుతూ, బుగ్గలు తడుముతూ, నుదుటిమీద ముద్దుపెట్టుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని జగనే స్వయంగా చెప్పారు. ముద్దుల విషయంపై ఒక జర్నలిస్టు జగన్ ను మీరు హ్యూమన్ టచ్ ఇవ్వడంలో రహస్యం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి జగన్ చెప్పిన సమాధానం, నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ” ప్రతీరోజూ కొన్ని వేల మంది నా దగ్గరకు వస్తుంటారు. నేను వాళ్లను ముట్టుకుంటే ఆనందపడతారు. కలిసి ఫొటో దిగి, దాచుకుంటారు.

నాయకుడు వాళ్లంత అత్యంత సన్నిహితంగా ఉన్నాడని ఆనందపడతారు. మా పార్టీకి నేను మాత్రమే స్టార్ క్యాంపెయినర్. నన్ను టచ్ చేయడం ద్వారానే అవతలి వారికి ఆనందం కలుగుతుంది. ఒకరకంగా ప్రతీ టచ్ లోనూ నాకు ఒక ఓటు కలిసొచ్చినట్లే” అంటూ తన ముద్దుల వెనుక ఉన్న స్టోరీ చెప్పుకొచ్చారు వైఎస్ జగన్.ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్ధి, నేరుగా ప్రజల వద్దకు వచ్చి, ప్రతీ ఒక్కరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం, ముద్దాడటం, మాట్లాడటం మనకు వింతగా అనిపించవచ్చు కానీ, అది జగన్ కు, వాళ్ల పార్టీకి బాగా కలిసొచ్చే అంశమే.

 

Comments

comments